IBPS: ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య పెంపు.. దరఖాస్తు చేశారా?

IBPS: దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఐబీపీఎస్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరించింది. ఆ నోటిఫికేషన్‌కు మరో 500 పోస్టుల్ని కలిపినట్టు వెల్లడించింది.

Published : 05 Jul 2023 16:46 IST

దిల్లీ: డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే వారికి ఐబీపీఎస్‌(IBPS) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల 4045 క్లర్క్‌ పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన ఐబీపీఎస్‌ సంస్థ.. తాజాగా ఆ నోటిఫికేషన్‌కు మరో 500 పోస్టులను కలిపింది. దీంతో భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 4545కి పెరిగింది. ఏదైనా డిగ్రీలో పాసైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జులై 21వరకు https://www.ibps.in/  దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం. వయో పరిమితి: 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
  • ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులివే..: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.
  • పరీక్ష తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. ప్రిలిమిన‌రీ పరీక్షను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తారు.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రామహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌; ఖమ్మం, వరంగల్‌. మెయిన్స్‌ పరీక్షను గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖ నగరాలతో పాటు హైదరాబాద్‌, కరీంనగర్‌లో నిర్వహించనున్నారు.

సవరించిన నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని