ICMAI CMA Foundation Results: సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. టాప్‌ 10లో మనోళ్లే అధికం!

Eenadu icon
By Features Desk Published : 08 Jul 2025 19:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: జూన్‌లో నిర్వహించిన కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (CMA)ఫౌండేషన్‌ పరీక్షల ఫలితాలను ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICMAI) మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ 10 ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉండటం విశేషం.  విద్యార్థులు ఐడెంటిఫికేషన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. 

ఫలితాలు, మెరిట్‌ లిస్ట్‌ల కోసం క్లిక్‌ చేయండి

సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షల్లో టాపర్లు వీరే.. 

  • తొలి ర్యాంక్‌: రియా పొద్దార్‌ (హావ్‌డా -పశ్చిమబెంగాల్‌)
  • రెండో ర్యాంక్‌: అక్షత్‌ అగర్వాల్‌ (సూరత్‌-గుజరాత్‌) 
  • మూడో ర్యాంక్‌:  మోహిత్‌ దాస్‌ (గుంటూరు), భవ్య అగర్వాల్‌ (రాజస్థాన్‌)
  • నాలుగో ర్యాంక్‌: పెనుగొండ సాయి రాఘవేంద్ర రెడ్డి (గుంటూరు) 
  • ఐదో ర్యాంక్‌: మట్టుపల్లి గాయత్రి శ్రావ్య (గుంటూరు)
  • ఆరో ర్యాంక్‌: మైత్రిక చొప్పర (గుంటూరు), బండి రెడ్డి మహేశ్వర్‌ (గుంటూరు) 
  • ఏడో ర్యాంక్‌: సాయి విశ్వనాథ్‌ బొమ్మకంటి (హైదరాబాద్‌), విజయ శ్రీ కె (తిరునల్వేలి), ఎ.హర్షిత (హైదరాబాద్‌)  
  • ఎనిమిదో ర్యాంక్‌: తోలేటి మనోజ్ఞ (గుంటూరు), పి. కౌశిక్‌ రాజ్‌ (గుంటూరు), అద్దెపల్లి విజిత (గుంటూరు)
  • తొమ్మిదో ర్యాంక్‌: రంజన ఎస్‌ (సేలం- తమిళనాడు), నంబూరి భరద్వాజ్‌ వర్మ (విశాఖ), కొండ్రాపు పూర్ణ చందు (విశాఖ), వాజాహత్‌ అహ్మద్‌ (హైదరాబాద్‌), కురుబ దీక్షిత్‌ (గుంటూరు)
  • పదో ర్యాంక్‌: జెని కిశోర్‌ కుమార్‌ ధామెలియ (సూరత్‌), కాసుమంచి సాత్విక (విజయవాడ), బొబ్బా శ్రుతి (విజయవాడ), సముద్రాల సాత్విక (గుంటూరు), పి. నిత్య సంతోషిని (హైదరాబాద్‌), తలసి గౌతమ్‌ కుమార్‌ (గుంటూరు) 

సీఎంఏ సంబంధిత వ్యవహారాలను ఐసీఎంఏఐ(ICMAI) పర్యవేక్షిస్తుంటుంది. కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌లు పెట్టుబడి, ప్రణాళికల విషయంలో, లాభాల ప్రణాళికలో, ప్రాజెక్ట్‌ నిర్వహణలో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో సేవలందిస్తుంటారు. ఈ కోర్సు కూడా సీఏ తరహాలోనే  ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ అనే మూడు దశలుగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని