JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిలిమినరీ కీ విడుదల.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రొవిజినల్‌ కీ విడుదలైంది. ఐఐటీ గువాహటి షెడ్యూల్‌ ప్రకారం వచ్చే వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Published : 11 Jun 2023 16:48 IST

గువాహటి: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ కీని  ఐఐటీ గువాహటి(IIT Guwahati) ఆదివారం విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు విద్యార్థులకు జూన్‌ 12 సాయంత్రం 5గంటలవరకు అవకాశం ఇచ్చింది. అలాగే, ఈ పరీక్షలో రెండు పేపర్లకు సంబంధించిన ప్రొవిజినల్‌ సమాధానాల కీలతో పాటు విద్యార్థులు తమ ఫీడ్‌బ్యాక్‌ తెలిపేందుకు ప్రత్యేకంగా లింక్‌లను అధికారిక వెబ్‌సైట్‌ https://jeeadv.ac.in/లో వేర్వేరుగా అందుబాటులో ఉంచింది. గువాహటి ఐఐటీ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం JEE Advanced Exam ఫలితాలను వచ్చే ఆదివారం (జూన్‌ 18న) విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-1 ప్రొవిజినల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-2 ప్రొవిజినల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

ఫీడ్‌బ్యాక్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని