JEE Main 2023 Result: జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

JEE Main 2023 Session 2 Resuts: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలను ఎన్‌టీఏ వెల్లడించింది.

Updated : 05 May 2023 14:28 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) శనివారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..👇

👉 లింక్‌ - 1

👉 లింక్‌ - 2

👉 లింక్‌ - 3

JEE Main session 1 పరీక్షలు జనవరిలో జరగ్గా.. ఏప్రిల్‌ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షను 8.24 లక్షల మంది విద్యార్థులు రాయగా.. రెండో విడత పరీక్షను దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.

ఈ నెల 30 నుంచే అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్లు మొదలు..

ఈ నెల 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8 వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష జూన్‌ 4న జరుగుతుంది. పేపర్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30వరకు ఉంటుంది. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్‌ 11న; ఫలితాలు జూన్‌ 18న విడుదల చేయనున్నట్టు ఐఐటీ గువాహటి షెడ్యూల్‌లో పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని