Government Jobs: ఇంకా వారమే గడువు.. ‘పది’ అర్హతతో 9,360 ఉద్యోగాలకు అప్లై చేశారా?

CRPF JOB recruitment: పదో తరగతి అర్హతపై సీఆర్‌పీఎఫ్‌లో 9వేలకు పైగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు డెడ్‌లైన్‌ సమీపిస్తోంది.

Published : 25 Apr 2023 01:44 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 9,360  కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. తొలుత ఏప్రిల్‌ 25వరకు దరఖాస్తులకు తుది గడువు పూర్తికానుండగా.. ఇటీవల ఆ నోటిఫికేషన్‌లో మార్పు చేస్తూ మే 2వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేందుకు మరో వారం రోజులే గడువు ఉంది.  కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులకు వయో పరిమితి 21-30 ఏళ్లు కాగా.. కానిస్టేబుల్‌(మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌) పోస్టులకు 18-26 ఏళ్లకు పెంచారు. మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 9,212 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పేర్కొనగా.. ఇటీవల మరో 148 ఉద్యోగాలను జత చేశారు.

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే.. 

  • మే 2 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
  • జూన్‌ 20 నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు  విడుదల చేస్తారు.
  • కంప్యూటర్‌ బేస్డ్‌టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ట్రేడ్‌టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(CBT) జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు.  
  • రాష్ట్రాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. ఏపీలో 428 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 307 పోస్టులు ఉన్నాయి.
  • వేతన స్కేలు: రూ.21,700 నుంచి రూ.69,100
  • కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) ఉద్యోగాలకు 21 నుంచి 30 ఏళ్లు వయో పరిమితి విధించారు. అదే, కానిస్టేబుల్‌ (ఎంఎంబీ/కోబ్లర్‌, కార్పెంటర్‌/టైరల్‌, బ్రాస్‌ బాండ్‌/పైప్‌ బాండ్‌/ గార్డెనర్‌/పెయింటర్‌/కుక్‌/వాటర్‌ కారియర్‌/వాషర్‌మ్యాన్‌/బార్బర్‌/సఫాయి కర్మచారి/మాసన్‌/పంబ్లర్‌/ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి.  ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
  • దరఖాస్తు రుసుం జనరల్‌ (పురుష) అభ్యర్థులకైతే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. 

  • అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గగుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్‌, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.. తెలంగాణలో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌,ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్‌, వరంగల్‌ (అర్బన్‌)
  • పరీక్ష విధానం: 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 2గంటల పాటు ఈ పరీక్ష ఉంటుుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి  25 ప్రశ్నలకు 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీకి 25 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఉంటాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని