JEE Main 2023: జేఈఈ మెయిన్‌ (సెషన్‌2) ఫైనల్‌ కీ విడుదల.. ఏ క్షణమైనా ఫలితాలు?

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష తుది సమాధానాల కీ విడుదలైంది. ఏ క్షణమైనా ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసే అవకాశం ఉంది.

Updated : 24 Apr 2023 19:54 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌(JEE Main) సెషన్‌ 2 పరీక్ష ఫైనల్‌ ప్రొవిజినల్‌ సమాధానాల కీ విడుదలైంది.  ఏ క్షణమైనా పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ(NTA)విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు JEE Main Session- 2 పరీక్ష జరగ్గా..  9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్‌ 21వరకు అభ్యంతరాలు స్వీకరించిన విషయం  తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన ఎన్‌టీఏ అధికారులు తాజాగా తుది సమాధానాల కీని విడుదల చేశారు. మరోవైపు, ఈరోజు జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఇప్పటివరకు ఫలితాల విడుదల తేదీపై ఎన్‌టీఏ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

తుది ప్రొవిజినల్‌ జవాబు కీ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు