NEET UG Counselling 2025: నీట్‌ (యూజీ) తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌.. రిజిస్ట్రేషన్‌ ఎలా? అలాట్‌మెంట్‌ ఎప్పుడు?

Eenadu icon
By Features Desk Published : 20 Jul 2025 21:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. నీట్‌ యూజీ (NEET UG 2025) పరీక్షలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆల్‌ ఇండియా, డీమ్డ్‌, సెంట్రల్‌, స్టేట్‌ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆల్‌ ఇండియా కోటా/డీమ్డ్‌/కేంద్ర విశ్వవిద్యాలయాల్లో సోమవారం నుంచి జులై 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం నీట్‌ (యూజీ)లో అర్హత సాధించిన విద్యార్థులు మెడికల్ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్‌ https://mcc.nic.in/ను సందర్శించి అక్కడ కౌన్సెలింగ్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది నీట్‌ - యూజీ పరీక్షకు 22.09 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. 12.36లక్షల మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.  

  • విద్యార్థులు తొలుత వెబ్‌సైట్‌లోని హోమ్‌ పేజీలో నీట్‌ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ 2025 అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. 
  • కౌన్సెలింగ్‌ టైప్‌ని సెలక్ట్‌ చేసుకొని అక్కడ మీ నీట్‌ యూజీ రోల్‌ నంబర్‌, పాస్‌ వర్డ్‌ ఎంటర్‌ చేయాలి.
  • ఆ తర్వాత సైన్‌ ఇన్‌పై క్లిక్ చేయండి.
  • కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు అక్కడ అడిగిన వివరాలను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయండి. 

ముఖ్యమైన తేదీలివే..

  • తొలి విడత కౌన్సెలిగ్‌/ సీట్ల కేటాయింపు ప్రక్రియ కోసం అభ్యర్థులు జులై 21 నుంచి జులై 28వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు జులై 28 మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ఇచ్చారు. 
  • అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకొనేందుకు జులై 22 నుంచి 28వ తేదీ రాత్రి 11.55గంటల వరకు అవకాశం ఉంటుంది. 
  • ఛాయిస్‌ లాకింగ్‌ జులై 28న సాయంత్రం 4గంటలకు మొదలై అదేరోజు రాత్రి 11.55గంటలతో ముగుస్తుంది. 
  • సీట్ల కేటాయింపు ప్రక్రియను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) జులై 29న ప్రారంభించి జులై 30తో పూర్తి చేస్తుంది. 
  • తొలిరౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు జులై 31న విడుదలవుతాయి. 
  • అభ్యర్థులు తమకు అలాట్‌ అయిన కాలేజీ పట్ల సంతృప్తి చెందితే అడ్మిషన్‌ కోసం ఆ కళాశాలలో ఆగస్టు 1 నుంచి 6వ తేదీ లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
  • జాయిన్‌ అయిన అభ్యర్థుల డేటాను ఆగస్టు 7, 8 తేదీల్లో ఎంసీసీ వెరిఫికేషన్‌ చేస్తుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని