NEET UG 2025: నీట్‌ (యూజీ)పై ఫేక్‌ ప్రచారమా? NTAకు రిపోర్టు చేయండిలా!

Eenadu icon
By Features Desk Published : 28 Apr 2025 17:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

NEET UG 2025 Exam | ఇంటర్నెట్ డెస్క్‌: మే 4న దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) పరీక్ష జరగనున్న వేళ ఎన్‌టీఏ కీలక చర్యలు చేపట్టింది. ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న NTA అధికారులు.. తాజాగా నీట్‌ యూజీపై నకిలీ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. నీట్‌కు సంబంధించి ఏదైనా అనుమానాస్పద, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను గుర్తిస్తే వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేలా ఓ కొత్త ప్లాట్‌ఫాంను రూపొందించారు. ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని తప్పుదారి పట్టించే ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్‌టీఏ సూచించింది. 

నీట్‌ (యూజీ) పరీక్ష పేపర్‌ యాక్సెస్‌ని క్లెయిమ్‌ చేసేలా అనధికార వెబ్‌సైట్‌లు/సోషల్‌ మీడియా ఖాతాలు; పరీక్ష కంటెంట్‌ యాక్సెస్‌కు సంబంధించి క్లెయిమ్‌ చేసే వ్యక్తులు; ఎన్‌టీఏ లేదా ప్రభుత్వ అధికారులమని చెప్పే వారికి సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల్ని ఈ పోర్టల్‌ https://neetclaim.centralindia.cloudapp.azure.com/ ద్వారా నివేదించవచ్చని సూచించింది. ఈ ఫారమ్‌ చాలా సరళంగా ఉంటుందని, యూజర్లు తామేం గమనించారో, ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలిపేందుకు వీలుగా సంబంధిత ఫైల్‌ను సైతం అప్‌లోడ్‌ చేసే వీలుందని తెలిపింది.

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం 2024కి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్‌టీ తెలిపింది. పబ్లిక్‌ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించడం, అభ్యర్థుల భవిష్యత్తును రక్షించడమే లక్ష్యమని పేర్కొంది. ఈ చట్టం కింద జరిగే నేరాలకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొంది. అనుమానాస్పద క్లెయిమ్‌లపై రిపోర్టు చేసేందుకు ఈ పోర్టల్‌ మే 4న సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని