SSC: అలర్ట్‌.. పలు ఉద్యోగాల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది!

ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నవారికి అలర్ట్‌. పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను SSC శనివారం విడుదల చేసింది.

Updated : 19 Aug 2023 18:06 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. వేల సంఖ్యలో ఉద్యోగాలను రిక్రూట్‌ చేయడంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన ఎస్‌ఎస్‌సీ.. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ (టైర్‌ 2) పరీక్షను అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది.

7 నోటిఫికేషన్లు.. 46,500+ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

అలాగే, కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ (10+2) పరీక్ష (టైర్‌-2)ను నవంబర్‌ 2న; జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌) పరీక్ష పేపర్‌ 2 ను డిసెంబర్‌ 4న; దిల్లీ పోలీస్‌, కేంద్ర సాయుధ పోలీస్‌బలగాల్లో ఎస్సై పరీక్ష (టైర్‌ 2)ను డిసెంబర్‌ 22వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించిన తదుపరి అప్‌డేట్ల కోసం ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌ను చెక్‌చేస్తుండాలని సూచించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని