Jobs Alert: 7 నోటిఫికేషన్లు.. 46,500+ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

Job Recruitment: దేశవ్యాప్తంగా పలు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

Updated : 15 Aug 2023 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతోన్న అభ్యర్థులకు అలర్ట్‌.. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 46,500లకు పైగా ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు గడువు సమీపిస్తుండటంతో ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి. తపాలా శాఖ, ఏకలవ్య పాఠశాలలు, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ సహా పలు విభాగాల్లో  భారీగా ఉద్యోగాలకు ఇటీవల వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల వివరాలు, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ వంటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. 


బీటెక్‌తో జేఈ ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌!

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వివిధ విభాగాల్లో 1324జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 16తో ముగుస్తోంది. పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


ఏకలవ్య స్కూల్స్‌లో 10వేలకు పైగా పోస్టులు.. 

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల(EMRS)ల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 10,391 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది భర్తీ దరఖాస్తుల గడువు ఆగస్టు 18తో ముగియనుంది. ఆకర్షణీయ వేతనాలతో కూడిన పలు ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు https://emrs.tribal.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. 


బ్యాంకుల్లో 4వేలకు పైగా ఉద్యోగాలు

దేశంలోని పలు బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి (Bank Jobs Recruitment Notifications) IBPS దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల గడువు ఆగస్టు 21తో ముగియనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వ జాబ్స్‌..

ఇంటర్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 1207 స్టెనో గ్రాఫర్‌ (గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌); స్టెనోగ్రాఫర్‌ డి(గ్రూస్‌ సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆగస్టు 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..


పరీక్ష లేదు.. పదో తరగతి పాసైతే చాలు..

తపాలా శాఖలో 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఆగస్టు 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు. పదో తరగతి మార్కుల్లో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు సంబంధించిన వివరాలకు క్లిక్‌ చేయండి


డీఆర్‌డీవోలో సైంటిస్ట్‌ ‘బి’ కొలువులు

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గేట్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులను డీఆర్‌డీవో ఉద్యోగాలకు ఆహ్వానిస్తోంది. ఆకర్షణీయ వేతనాలతో మొత్తం 204 సైంటిస్ట్‌ ‘బి’ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు ఆగస్టు 31వరకు ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


ఏఏఐలో 342 ఉద్యోగాలు.. వేతనం ఎంతో తెలుసా?

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కొనసాగుతున్నాయి. వివిధ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌), సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌),  ఎగ్జిక్యూటివ్‌ సహా మొత్తం 342 ఉద్యోగాలకు సెప్టెంబర్‌ 4వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని