SSC GD Constable: సీఏపీఎఫ్‌లో 50వేలకు పైగా పోస్టులు.. ఫిజికల్‌ టెస్ట్‌ వాయిదా

SSC GD 2023: సాయుధ బలగాల్లో 50వేలకు పైగా కానిస్టేబుల్‌ (జీడీ) ఉద్యోగాల భర్తీకి జరగాల్సిన ఫిజికల్‌ టెస్ట్‌ తేదీల్లో మార్పలు చోటుచేసుకున్నాయి. 

Updated : 21 Apr 2023 20:04 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో(CAPF) 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ విషయంలో సీఆర్‌పీఎఫ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి జరగాల్సిన శారీరక సామర్థ్య పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ, పీఈటీలను ఏప్రిల్‌ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు ఏప్రిల్‌ 19న సీఆర్‌పీఎఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,  పాలనాపరమైన కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంటూ సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ (రిక్రూట్‌మెంట్‌) అధికారిక ప్రకటన విడుదల చేశారు. రీ షెడ్యూల్‌ చేసిన ఈ పరీక్షను మే 1 నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.

రీషెడ్యూల్‌ అయిన ఈ పరీక్షకు కొత్తగా ఈ- అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు. అందుకోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://rect.crpf.gov.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోలని సూచించించారు.  ఈ-అడ్మిట్‌ కార్డులు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తామని ఇదివరకే సీఆర్‌పీఎఫ్‌ స్పష్టంచేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని