SSC GD Constable: 50వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ.. మెడికల్‌ టెస్ట్‌కు అడ్మిట్‌ కార్డులు విడుదల

సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ జీడీ పోస్టుల భర్తీకి సంబంధించి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. 

Updated : 12 Jul 2023 20:15 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో (CAPF) 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. మెడికల్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల ఈ -అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది.  ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(CRPF).. అడ్మిట్‌ కార్డులు ఉంటేనే ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను అనుమతిస్తామని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జులై 17 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదల కాగా..  శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 లక్షల మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. వారిలో 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.  వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం రిజర్వేషన్లు అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని