SSC Exam: ఎస్‌ఎస్‌సీ జేఈ, స్టెనో పరీక్ష తేదీల ప్రకటన

SSC Jobs: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే జూనియర్‌ ఇంజినీర్‌, స్టెనో గ్రాఫర్‌ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.

Published : 18 May 2023 19:58 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఖరారు చేసింది.  జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) పరీక్ష (పేపర్‌ 1) అక్టోబర్‌ 9, 10, 11 తేదీల్లో; స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి అండ్‌ డి పరీక్షను అక్టోబర్‌ 12, 13 తేదీల్లో; జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ అండ్‌ సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పరీక్షను అక్టోబర్‌ 16న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని