Telangana ICET Results: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

TG ICET 2024 Results| తెలంగాణలో ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు, ర్యాంక్‌ కార్డు కోసం ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయండి

Updated : 14 Jun 2024 19:23 IST

Telangana ICET Results | హైదరాబాద్‌: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ ఐసెట్‌కు 86,156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77,942 మంది పరీక్ష రాశారు. వీరిలో 71,647 మంది (91.92%) అర్హత సాధించినట్లు టీజీ ఐసెట్‌ కన్వీనర్‌ వెల్లడించారు. వీరిలో 66,104మంది లోకల్‌ కేటగిరీలో, 5,543 మంది నాన్‌ లోకల్‌ కేటగిరీలో క్వాలిఫై అయినట్లు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని