TG LAWCET 2025: తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ (TG LAWCET & PGLCET-2025) రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలను జూన్ 25 విడుదల చేయనున్నారు. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం మధ్యాహ్నం 3.30గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మాసబ్ ట్యాంక్‌లో ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేస్తారు.
జూన్ 6న టీజీ ఎల్‌సెట్ అండ్ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 57,715 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది పరీక్ష రాశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది అభ్యర్థులు చొప్పున హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బీసీసీఐ చేయూత.. టీమ్ఇండియా విజేత!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 


