Polycet 2025 Results: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు రేపే.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో చూడొచ్చు!

Eenadu icon
By Features Desk Updated : 23 May 2025 17:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

TG Polycet 2025 Results| ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్‌(TG Polycet) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్ష ఫలితాలను శనివారం (మే 24) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ (ఎస్‌బీటెట్‌) కార్యదర్శి బి.శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలిసెట్‌-2025కు 92.64% మంది హాజరైన విషయం తెలిసిందే. దీనికి మొత్తంగా 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు. విద్యార్థులు తమ ఫలితాలను Results.eenadu.net లో తెలుసుకోవచ్చు.


Published : 23 May 2025 17:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని