TGPSC: తెలంగాణ జేఎల్‌ నియామక పరీక్ష ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా ఇదే..

Eenadu icon
By Features Desk Updated : 08 Jul 2024 20:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

TGPSC JL general ranking list| హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ తేదీల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ (TGPSC) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఒక అభ్యర్థి ఫలితాన్ని విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు పేర్కొంది.  సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. 

ర్యాంకుల జాబితా కోసం క్లిక్‌ చేయండి


Published : 08 Jul 2024 19:32 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని