UPSC Civils prelims Results: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

Eenadu icon
By Features Desk Updated : 17 Jun 2025 16:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష-2025 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష నిర్వహించిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) అధికారులు ఫలితాలను బుధవారం విడుదల చేశారు. మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్‌ నంబర్లతో ప్రత్యేక జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీలను ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సైతం యూపీఎస్సీ విడుదల చేసింది. ఐఎఫ్‌ఎస్‌ (మెయిన్‌) పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను వేరేగా విడుదల చేసింది. (UPSC Civils prelims Results 2025)

మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా

సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్స్‌) పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు రూ.200 చొప్పున రుసుం చెల్లించి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు/పీడబ్ల్యూబీడీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు. జూన్‌ 16 నుంచి 25వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు ప్రత్యేక విండో అందుబాటులో ఉంచుతారు. కోర్టు కేసుల నేపథ్యంలో నలుగురు అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

 ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఈ ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం/వివరణ కోసం విద్యార్థులకు యూపీఎస్సీ ఫెసిలిటేషన్‌ కౌంటర్‌ను దిల్లీలోని షాజహాన్‌ రోడ్డులో ఎగ్జామినేషన్‌ హాల్‌ భవనం వద్ద ఏర్పాటు చేసింది. అన్ని పనిదినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్వయంగా వచ్చిగానీ, ఫోన్‌ నంబర్లు 011-23385271, 011-23098543, 011-23381125కు కాల్‌ చేసి గానీ సంప్రదించవచ్చు.


Published : 11 Jun 2025 19:35 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని