కొత్త దీవులు... పుట్టుకొచ్చాయ్‌!

భూగోళంపై కొత్త ప్రాంతాల్ని కనిపెట్టడం ఏనాడో పూర్తయ్యింది అనుకుంటాం. కానీ ఈమధ్యనే ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 400 కొత్త ద్వీపాల్ని కనుగొన్నారు. ఎక్కడో ఏంటో తెలుసుకుందామా? ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ద్వీప సముదాయ దేశం ఫిలిప్పీన్స్‌. ఇది వరకు 7,100 దీవులతో ఉండేది. కొత్తగా బయటపడ్డ ద్వీపాలతో కలుపుకుంటే వాటి సంఖ్య ఇప్పుడు 7,500కి చేరింది.

Published : 26 May 2016 01:13 IST

కొత్త దీవులు... పుట్టుకొచ్చాయ్‌!

భూగోళంపై కొత్త ప్రాంతాల్ని కనిపెట్టడం ఏనాడో పూర్తయ్యింది అనుకుంటాం. కానీ ఈమధ్యనే ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 400 కొత్త ద్వీపాల్ని కనుగొన్నారు. ఎక్కడో ఏంటో తెలుసుకుందామా?

* ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ద్వీప సముదాయ దేశం ఫిలిప్పీన్స్‌. ఇది వరకు 7,100 దీవులతో ఉండేది. కొత్తగా బయటపడ్డ ద్వీపాలతో కలుపుకుంటే వాటి సంఖ్య ఇప్పుడు 7,500కి చేరింది.

* కొత్తగా గుర్తించిన ఈ దీవుల్ని ఒకే భూఖండంగా భావించేవారు. కానీ అవి వేటికవే విడివిడిగా ఉన్నాయని తాజా పరిశోధనలో తెలిసింది.

* ఎలా కనిపెట్టారంటే... ఫిలిప్పీన్స్‌ జాతీయ మ్యాపింగ్‌ అండ్‌ రిసోర్స్‌ ఏజెన్సీ ‘ఇంటర్‌ ఫెరోమెట్రిక్‌ సింథటిక్‌ అపెర్చూర్‌ రాడార్‌’ అనే అత్యాధునిక పరికరాన్ని ఉపయోగించి ఈ దీవుల జాడను పసిగట్టారు.

* ఫిలిప్పీన్స్‌ దీవుల్ని లుజోన్‌, విసయస్‌, మిండానావో అని మూడు భాగాలుగా విభజించారు. ఇప్పుడు బయటపడ్డ దీవుల్లో ఎక్కువ మిండానావో సమీపంలోనే ఉన్నాయి.

* కొత్త దీవులు కదా అని వెంటనే షికారుకు వెళ్దామంటే ఇప్పట్లో కుదరదు. ఎందుకంటే అవి నివాసయోగ్యంగా ఉన్నాయో లేదో ఇంకా తేలలేదు. ఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే ఉన్న 7,100 దీవుల్లో కేవలం 2,000 దీవులు మాత్రమే నివాసానికి యోగ్యంగా ఉన్నాయి. మిగిలిన వాటికి ఇంకా పేర్లు కూడా పెట్టలేదు.

* భూభాగానికి చుట్టూ నీరుంటే సరిపోదు. సముద్రమట్టానికి కాస్త ఎత్తుగా ఉండి జంతువులు లేదా వృక్షాలకు అనుకూలంగా ఉన్న వాటినే దీవులుగా గుర్తిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని