ఆ పసికందు చనిపోయింది

ఇజ్రాయెల్‌ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది.

Published : 27 Apr 2024 05:57 IST

రఫా,  జెరూసలెం: ఇజ్రాయెల్‌ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. ఈ విషయాన్ని శుక్రవారం శిశువు బంధువు ఒకరు తెలిపారు. వారం క్రితం దక్షిణ గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో శిశువు తండ్రి, తల్లి సబ్రీన్‌ అల్‌ సకానీ, నాలుగేళ్ల సోదరి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే మృతదేహాలను దగ్గరలోని ఆస్పత్రికి చేర్చారు. గర్బిణిగా ఉన్న తల్లి అల్‌ సకానీ గర్భం నుంచి శిశువును వైద్యులు రక్షించారు. అప్పటి నుంచి ఆ పసికందును ఇంక్యుబేటర్‌లోనే ఉంచారు. రక్షించడానికి వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించారని, కానీ కాపాడలేకపోయారని బంధువు పేర్కొన్నారు.

ఎర్రసముద్రంలో మరో నౌకపై దాడి!

ఎర్రసముద్రం సమీపంలో మరో వాణిజ్యనౌకపై శుక్రవారం దాడి జరిగింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై హూతీ తిరుగుబాటుదారులు మూడు క్షిపణులు ప్రయోగించినట్లు ప్రైవేటు భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. ఇవి నౌకను తాకలేదని పేర్కొంది. ఈ నౌక రష్యాలోని ప్రిమోస్క్‌ నుంచి భారత్‌లోని వాడినార్‌కు వెళుతోందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని