దీవుల్లో దీవులై!

అనగనగా ఓ దీవి...ఆ దీవిలో సరస్సు...అందులో ఓ దీవి...మళ్లీ దాంట్లో ఓ సరస్సు...ఆ సరస్సులో ఇంకో దీవి... ఏంటీ ఇదంతా?చదవడానికే గందరగోళంగా ఉంది అంటారా?ఏమిటో ఆ వివరాలు? కొన్నిచోట్ల దీవుల్లో సరస్సులుంటాయి. మరి కొన్నిచోట్ల సరస్సుల్లో దీవులు ఉంటాయి. కానీ ఫిలిప్పీన్స్‌ దీవుల సముదాయంలో ఉన్న లూజాన్‌ అనే ఓ ద్వీపం అలా ఇలా కాదు. అంతకు మించి.

Published : 30 Mar 2018 01:47 IST

దీవుల్లో దీవులై!

అనగనగా ఓ దీవి...ఆ దీవిలో సరస్సు...అందులో ఓ దీవి...మళ్లీ దాంట్లో ఓ సరస్సు...ఆ సరస్సులో ఇంకో దీవి... ఏంటీ ఇదంతా?చదవడానికే గందరగోళంగా ఉంది అంటారా?ఏమిటో ఆ వివరాలు?
కొన్నిచోట్ల దీవుల్లో సరస్సులుంటాయి. మరి కొన్నిచోట్ల సరస్సుల్లో దీవులు ఉంటాయి. కానీ ఫిలిప్పీన్స్‌ దీవుల సముదాయంలో ఉన్న లూజాన్‌ అనే ఓ ద్వీపం అలా ఇలా కాదు. అంతకు మించి.
* ఫిలిప్పీన్స్‌ దీవుల్లో అత్యధిక జనాభా ఉన్న దీవుల్లో ఈ ద్వీపమొకటి. 1,09,965 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో తాల్‌ అనే మంచినీటి సరస్సు ఒకటుంది. ఇంతవరకే అయితే దీని గురించి కూడా చెప్పుకోనక్కర్లేదు. మరి అసలు ప్రత్యేకత ఏంటంటే... ఈ సరస్సులో మళ్లీ ద్వీపం. అందులో మళ్లీ సరస్సు. మళ్లీ అందులో బుల్లి ద్వీపం. అవును మీరు సరిగ్గానే చదివారు. తికమక ఏమీ లేదు.
* ఇక వివరాల్లోకి వెళితే లూజాన్‌ ద్వీపంలోని తాల్‌ సరస్సులో అగ్నిపర్వత ద్వీపం ఉంది. ఇది విస్ఫోటనం చెందడం వల్ల ఈ అగ్నిపర్వత ద్వీపంలోనే ఓ భారీ సరస్సు ఏర్పడింది. ఇదే అగ్ని
పర్వత బిలం(క్రాటర్‌ లేక్‌). దీన్నే ఎల్లో లేక్‌, మేన్‌ క్రాటర్‌ లేక్‌ అంటూ బోలెడు పేర్లతో పిలుస్తారు.
* ఈ అగ్నిపర్వత బిలం మధ్యలో వోల్కన్‌ పాయింట్‌ బుల్లి ద్వీపంలా ఉంటుంది. ఇదంతా చూస్తుంటే... గమ్మత్తుగా మూడు అంచెల్లో ద్వీపాలున్నట్టుగా ఉంటుందన్నమాట.
* ఈ థర్డ్‌ ఆర్డర్‌ ఐలాండ్‌ని చూడ్డానికి  పర్యాటకులూ వస్తుంటారు.
* శాటిలైట్‌ వ్యూలో పై నుంచి దీన్ని చూస్తుంటే భలేగా ఆశ్చర్యమేస్తుంది.
* ఇలాంటిదే కెనాడాలోనూ ఒకటుంది. పేరు విక్టోరియా ఐలాండ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని