Train Ticket: ‘యూటీఎస్‌’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్‌ టికెట్‌ కొనచ్చు..

కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్‌ టికెట్‌ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే.

Updated : 26 Apr 2024 07:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్‌ టికెట్‌ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. దీంతో రైల్వేశాఖ గతంలోనే యూటీఎస్‌(అన్‌రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను తీసుకువచ్చింది. బుకింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరకుండా ఫోన్‌లోనే సులువుగా జనరల్‌ టికెట్లు తీసుకునే వీలు కల్పించింది. అయితే స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించిన రైల్వేశాఖ తాజాగా ఎంత దూరం నుంచైనా టికెట్లు పొందేలా వీలు కల్పించింది. అంటే ఇకపై ఇంట్లో ఉండగానే టికెట్‌ తీసుకుని సమయానికి వచ్చి రైలు ఎక్కవచ్చు. ప్లాట్‌ఫామ్‌ టికెట్లనూ పొందవచ్చు. కానీ స్టేషన్‌కు 50 మీటర్లలోపు మాత్రం ఈ యాప్‌ పనిచేయదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని