ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్‌ కాదా!

గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్‌ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.

Updated : 26 Apr 2024 20:03 IST

గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్‌ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. మళ్లీ అదే రోజు రాత్రి విజయవాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేటప్పుడు గాయానికి చిన్న బ్యాండేజ్‌తో వెళ్లారు. బయటకొచ్చేటప్పుడూ చిన్న ప్లాస్టర్‌తోనే కనిపించారు.

రెండు రోజుల తర్వాత అదే గాయంపై కొంచెం పెద్ద ప్లాస్టర్‌ వేసుకున్నారు. అప్పటి నుంచి గురువారం వరకూ వేసుకుంటున్న ప్లాస్టర్‌ పరిమాణం కొద్ది కొద్దిగా పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని