ప్రవహించే ఇంద్రధనుస్సు!
ఎక్కడైనా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా ఉందే’ అనిపించకమానదు.
ప్రవహించే ఇంద్రధనుస్సు!
కొలంబియా
పంచవన్నెల నది! ఎక్కడైనా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా ఉందే’ అనిపించకమానదు. ప్రపంచంలోని అందమైన నదుల్లో ఒకటిది. ఇంతకీ నది పేరు చెప్పలేదు కదూ... పేరు కేనో క్రిస్టేల్స్. ఇక్కడి సెరెనియా డి లా మెకెరెనా పర్వత శ్రేణిలో ఉంటుందిది. ప్రకృతి అందాలన్నీ కనిపించే ఈ నదిలో రంగులు ఎలా వచ్చాయబ్బా అంటే... ఈ నది అడుగు భాగం వేల సంవత్సరాల క్రితం క్వార్ట్జ్ అనే రాయితో ఏర్పడిందట. ఈ రాయిపై జులై నుంచి నవంబరు మధ్య కాలంలో రంగు రంగుల మెకెరెనియా క్లెవెజెరా అనే నాచు పెరుగుతుంది. ఈ నాచే నదికి వర్ణాల్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఈ వర్ణాల అందాల వల్ల ఈ నదినే ‘లిక్విడ్ రెయిన్బో’ అనే పేరుతోనూ పిలుస్తారు.
|
కాఫీ తాగరా బాబూ! * మన దగ్గర ఎదిగే పిల్లలంతా పాలు తాగినట్టు ఇక్కడి చిన్నారులు కాఫీ తాగుతారు. రోజూ భోజనం తర్వాత పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన ‘కాఫీ కాన్ లేచే’ ఇస్తారు.
|
* కొలంబియా... దక్షిణ అమెరికాలోని వాయువ్యభాగంలో ఉంటుందీ దేశం. తూర్పున వెనుజులా, బ్రెజిల్, దక్షిణాన ఈక్వెడార్, పెరూ, ఉత్తరాన కరీబియన్ సముద్రం, వాయువ్యంలో పనామా, పశ్చిమాన పసిఫిక్ మహా సముద్రం ఉంటాయి. మొత్తం ఐదు దేశాల సరిహద్దుల్ని పంచుకుంటుందిది. * ఇక్కడ చాలా స్థానిక భాషలున్నాయి. కానీ 99 శాతం మంది జనాభా స్పానిష్లోనే మాట్లాడతారు. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు