Trees Colour: చంటీ సందేహం తీరిపోయింది!

Eenadu icon
By Features Desk Updated : 04 Nov 2025 05:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఫ్రెండ్స్‌..! మనకు ఆకులు అనగానే ఆకుపచ్చ రంగే గుర్తుకొస్తుంది కదా! ఎందుకంటే మనం రోజూ చూసే చెట్ల ఆకులన్నీ ఆ రంగులోనే ఉంటాయి కాబట్టి. కానీ కొన్ని చెట్ల ఆకులు ఎరుపు, పసుపు, నారింజ ఇలా రకరకాల రంగుల్లో ఉంటాయి. అలాగే ఆకుపచ్చగా ఉన్న ఆకులు వాడిపోయేటప్పుడు పసుపురంగులోకి మారతాయి కదా! అసలు వీటన్నింటికీ కారణాలేంటో తెలుసుకోవాలని చంటికి అనిపించింది. వెంటనే వెళ్లి వాళ్ల తాతయ్యని అడిగాడు.. మరి ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా!

‘అన్ని ఆకుపచ్చ ఆకుల్లో క్లోరోఫిల్, అంథోసైనిన్, కెరోటినాయిడ్స్‌ అనే మూడు రంగులకు సంబంధించిన లిక్విడ్స్‌ ఉంటాయి. క్లోరోఫిల్‌ ఆకుపచ్చ రంగు, అంథోసైనిన్‌ నారింజ, కెరోటినాయిడ్స్‌ పసుపు రంగును సూచిస్తాయన్నమాట. అయితే మనం రోజూ చూసే ఆకుల్లో క్లోరోఫిల్‌ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అలాగే మనకు అక్కడక్కడా పార్కులు, తోటల్లో కనిపించే ఎరుపు రంగు చెట్ల ఆకుల్లో అంథోసైనిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఎప్పుడైనా గమనించావా చంటీ! కొన్ని చెట్ల ఆకులు మొదట్లో ఎరుపు రంగులో ఉంటే.. మరికొన్ని చెట్లవి వాడిపోయేటప్పుడు పసుపు, నారింజ రంగులోకి మారతాయి. దానంతటికీ కారణం.. ఈ లిక్విడ్స్‌ హెచ్చుతగ్గులేనన్నమాట’ అని వివరించారు చంటీ వాళ్ల తాతయ్య. ‘ఇప్పుడు విషయం అర్థమైంది తాతయ్యా.. థాంక్యూ!’ అనుకుంటూ వెళ్లి పడుకున్నాడు చంటీ. నేస్తాలూ.. ఒకవేళ క్లోరోఫిల్‌ కంటే అంథోసైనిన్‌ ఉన్న చెట్లే ఎక్కువగా ఉంటే.. పచ్చని అడవికి బదులుగా ఎర్రని అడవి అనేవాళ్లేమో కదూ! 


Published : 04 Nov 2025 00:17 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు