నిబంధనలు అతిక్రమిస్తే..?

హెచ్‌ఎండీ మున్సిపల్‌ నిబంధనలు అతిక్రమించి ఇంటి నిర్మాణం చేస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

Published : 12 Mar 2016 17:10 IST

నిబంధనలు అతిక్రమిస్తే..?

హెచ్‌ఎండీ మున్సిపల్‌ నిబంధనలు అతిక్రమించి ఇంటి నిర్మాణం చేస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

ప్లాట్లు విక్రయించేవాళ్లు బ్రోచర్లతో ఎరవేస్తారు. కొనేటప్పుడు బ్రోచర్లలో ఉన్నట్లుగానే భావించి కొనేందుకు సిద్ధపడతాం. అది చాలా రిస్క్‌. ఏదైనా కట్టడాన్ని నిర్మించే వ్యక్తి ముందు పురపాలక శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు ప్లాన్‌ అప్రూవ్‌ చేస్తారు. ఆ ప్లాన్‌కు బిల్డర్‌ చేసిన ప్లాన్‌ విరుద్ధంగా ఉంటే దాన్ని డీవియేషన్‌ అంటాం. అది చట్టరీత్యా అక్రమ కట్టడం కిందకు వస్తుంది. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తపడాలి. లేకపోతే పురపాలకశాఖ అధికారులకు భవనాన్ని కూలగొట్టే అధికారం ఉంటుంది. అందువల్ల ముందే వెరిఫై చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని