స్థలం కొనుగోలు చేసేముందు..

మేం కొనబోయే స్థలం ప్రధాన రహదారికి బాగా దగ్గరగా ఉంది. రహదారి విస్తరణ పనుల్లో ఇది పోతుందా అన్న సందేహం ఉంది!

Published : 30 Apr 2016 22:33 IST

మేం కొనబోయే స్థలం ప్రధాన రహదారికి బాగా దగ్గరగా ఉంది. రహదారి విస్తరణ పనుల్లో ఇది పోతుందా అన్న సందేహం ఉంది! దీన్ని కొనుగోలు చేసేముందు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎలాంటి అంశాలు పరిశీలించాలి?


స్థలం కొన్నాక ఇల్లు కట్టుకునేందుకు అనుమతి తీసుకొని పనులు మొదలు పెట్టేప్పుడు అది భారీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిగా తేలితే ఇబ్బంది పడాలి. అందుకనే కొనుగోలు చేయబోయే భూమి ఇటువంటి ప్రాజెక్టుల కింద ఉందో లేదో తెలుసుకోవాలి. అందుకోసం ఆ సర్వే నెంబర్‌ ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు కింద ఉందో తెలుసుకొని అక్కడ విచారణ జరపటం మంచిది. ఎమ్మార్వో ఆఫీసులోనూ సర్వే నెంబర్‌ బట్టి విచారణ చేయడం మంచిది. దీనివల్ల గవర్నమెంట్‌ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం మీకు తెలుస్తుంది. దాన్నిబట్టి మీరు కొనబోయేభూమి పోతుందో లేదో తెలుస్తుంది.

- ఎస్‌.ముజిబ్‌ కుమార్‌, న్యాయవాది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని