Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్‌ 21 - ఏప్రిల్‌ 27)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 21 Apr 2024 09:44 IST

శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. ఇతరులకూ మేలు చేస్తారు. అధికారులతో సామరస్యంగా మెలగాలి. మీరు ఎంచుకున్న మార్గమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.  ఒత్తిడిని జయిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మీయుల సూచనలు పాటించండి. సూర్యభగవానుడిని స్మరించండి.


అదృష్టయోగం ఉంది. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఏకాగ్రత అవసరం. మనసు మాట వినండి. ఇతరుల ప్రభావానికి లోను కావద్దు. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఆటంకాలను అధిగమిస్తారు. పరిస్థితులను అర్థంచేసుకోండి. సమయానుకూలంగా వ్యవహరించండి. ఇష్టదైవాన్ని స్మరించండి.


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగు తుంది. ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపార విషయాల్లో తడబాటు వద్దు. మీదైన రంగంలో రాటుదేలతారు. న్యాయపరమైన విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆత్మీయుల మధ్య అపోహలు తొలగుతాయి. ఇష్టదైవాన్ని దర్శించండి.  


అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. మునుపటి వైభవాన్ని పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం. అధికారుల ప్రశంసలు అందుతాయి. వినూత్నమైన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పొదుపు-మదుపు నిర్ణయాలకు సరైన సమయం. మనోబలంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి.


ధనయోగం ఉంది. ఆర్థిక విజయం సాధిస్తారు. ధర్మమార్గాన్ని వీడకండి. అనుమానాస్పద వ్యక్తులను దూరం ఉంచండి. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఎక్కడా అపోహలకు తావివ్వకండి. ఆత్మస్థైర్యంతో ఒత్తిడిని జయిస్తారు. వారాంతంలో శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఏకాగ్రతతో కొత్త పనులు ప్రారంభించండి. బుద్ధిబలంతో అవరోధాలను అధిగమిస్తారు. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇతరులు మీ పట్ల అసూయ పెంచుకుంటారు. అయినా, మీదైన ధర్మాన్ని వదిలిపెట్టకండి. విఘ్నాల నుంచి తొందరగా బయట పడతారు. వివాదరహితంగా వ్యవహరించండి. ఆంజనేయ స్వామిని పూజించండి.


గురుబలం ముందుకు నడిపిస్తుంది. తెలివితేటలతో వ్యవహరించాలి. ఒత్తిడిలేని నిర్ణయాలు తీసుకోండి. కార్యాలయంలో కొంత వ్యతిరేకత ఎదురైనా, దీర్ఘకాలంలో మీ వ్యక్తిత్వమే మీకు బాసటగా నిలుస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. విస్తరణ దిశగా అడుగులు వేస్తారు. బుద్ధి బలం మిమ్మల్ని కష్టాల నుంచి ఒడ్డున పడేస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ వల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. వ్యాపారంలో ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. అవరోధాలను అధిగమించాలి. ముఖ్య నిర్ణయాల్లో నిపుణుల సంప్రదింపులు అవసరం. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.


మీ నిర్ణయాలు భవిష్యత్తులో లాభాల పంట పండిస్తాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీదైన రంగంలో గుర్తింపు పొందుతారు. అన్ని విధాలా కలిసొచ్చే సమయం. సమయ స్ఫూర్తితో పెద్దలను మెప్పిస్తారు. సంపదలు వృద్ధి చెందుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


బలమైన సంకల్పంతో ముందడుగు వేస్తారు. ధనలాభం ఉంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. కలహాలకు ఆస్కారం ఇవ్వొద్దు. ఒత్తిడితో  నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. వారాంతంలో మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రం పఠించాలి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్‌ చేయండి


ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. అధికారయోగం సూచితం. కీలక వ్యక్తుల ప్రశంసలు అందుకుంటారు. తొందర పాటు నిర్ణయాలు వద్దు. నైపుణ్యాన్ని పెంచు కుంటారు. మిత్రుల మద్దతుతో ఓ అవ రోధాన్ని అధిగమిస్తారు. ఎంతోకాలంగా పరిష్కారానికి నోచుకోని ఓ పని కొలిక్కి వస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.  


కొత్త పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంది. తరచూ నిర్ణయాలు మార్చుకోవద్దు. కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ వ్యవహారంలో లాభ పడతారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టమే. సంప్రదింపుల తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనలు వద్దు. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..