పాతసామాన్ల ధగధగలు

జ్యువెల్లరీ ఫ్యాషన్‌ షో. అదీ సొగసుల రాజధాని అమెరికాలోని న్యూయార్క్‌లో.

Published : 25 Feb 2017 01:21 IST

పాతసామాన్ల ధగధగలు

జ్యువెల్లరీ ఫ్యాషన్‌ షో. అదీ సొగసుల రాజధాని అమెరికాలోని న్యూయార్క్‌లో. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్లు తమ ప్రతిభను చూపిస్తున్నారు. ముత్యాలు, వజ్రాలు, రత్నాలు.. ఇతర ఖరీదైన నగల డిజైన్లు ధరించి మోడళ్లు క్యాట్‌వాక్‌లు చేస్తున్నారు. ఇంతలో మన డిజైనర్‌, దిల్లీ అమ్మాయి ఆంచల్‌ సుఖీజా వంతు వచ్చింది. తన డిజైన్లు ధరించిన మోడళ్లు హొయలొలికిస్తూ ర్యాంప్‌పై నడవసాగారు. ఆ ఆభరణాలు చూసి చూపరులు ఆశ్చర్యపోయారు. వాషర్‌పైపులు, స్టీలు బోల్టులు, మాప్‌ హెడ్లు ఏసీ ఫిల్టర్ల ఫోమ్‌లతోనే తయారు చేసిన నగలు ధగధగలాడాయి. ఈ సరికొత్త ప్రయోగం అందరికీ నచ్చింది. చప్పట్లు మార్మోగిపోయాయి. ఆంచల్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయి కూర్చుంది. ‘నాకు ముందే తెలుసు. అందరిలా కాకుండా భిన్నంగా ఉంటే మంచి పేరొస్తుందని’ అంటూ మురిసిపోతోంది. పాత పేపర్లు, రీసైకిల్‌ చేయగల వస్తువులతో ఆంచల్‌ గతంలోనూ పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని