Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 Apr 2024 20:59 IST

1.తిరుగుబాటు మొదలైంది.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు

రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే మిథున్‌రెడ్డి ఓడిపోవాలన్నారు. వైకాపాకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ

సంపద పునఃపంపిణీ, మంగళసూత్రం, వారసత్వ పన్ను.. తన ప్రసంగాల్లో ఈ పదాలను ఉపయోగించి ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై హస్తం పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) .. మోదీకి లేఖ రాశారు. చప్పట్లకు మోసపోకండంటూ సూచనలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్‌

వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజంపేటలో నిర్వహించిన తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి సభలో పవన్‌ మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి తీసుకొచ్చిన రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ‘డైనోసర్లు’లా కాంగ్రెస్‌ అంతరించిపోతుంది’.. రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శల బాణాలు

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) కాంగ్రెస్‌ పార్టీ (Congress)పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంతరించే దశకు చేరిందన్నారు. మరికొద్ది కాలంలో ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.. పొలిటికల్‌ సర్వీసు అధికారులుగా మారిపోయారని భాజపా సీనియర్‌ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలపై దాడులు జరుగుతున్నా, శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా డీజీపీ పట్టించుకోవటం లేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఆన్‌లైన్‌లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్‌ కార్డ్‌ వ్యయం

దేశంలో క్రెడిట్‌ కార్డుల (Credit card) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఈతరహా లావాదేవీలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆన్‌లైన్‌లో చేసే వ్యయాలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో తొలిసారి రూ.1,04,081 కోట్ల మైలురాయిని అధిగమించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ప్రపంచంలోనే ‘కాస్ట్‌లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?

ప్రజాస్వామ్య పండగగా భావించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరంలో వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు ఖర్చవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓపెన్‌సీక్రెట్స్‌ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం (రూ.1.2 లక్షల కోట్లు)ను ఇది దాటిపోనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్‌ కీలక ప్రతిపాదన!

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి (Israel- Hamas War) దాదాపు ఏడు నెలలవుతోంది. ఇప్పటికీ అనేకమంది బందీలు ఉగ్ర చెరలోనే ఉన్నారు. మరోవైపు టెల్‌అవీవ్‌ భీకర దాడులు.. గాజాను మరుభూమిగా మారుస్తున్నాయి. ఇప్పటికే 34 వేల మందికి పైగా మృతి చెందారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్‌రెడ్డి

70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా గురువారం రాత్రి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో సీఎం ప్రసంగించారు. 400 ఎంపీ సీట్లు వస్తే.. రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని