క్వింటా ధాన్యంపై రూ.400 దోపిడీ

  ధాన్యం కొనుగోళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హమాలీ ఛార్జీలు, గోతాలు, రవాణా ఛార్జీల పేరుతో క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారని మాజీ మంత్రి

Published : 22 May 2022 05:58 IST

మాజీమంత్రి ఆలపాటి

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  ధాన్యం కొనుగోళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హమాలీ ఛార్జీలు, గోతాలు, రవాణా ఛార్జీల పేరుతో క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘‘ధాన్యం సేకరణ, అమ్మకాల పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని అధికార పార్టీ ఎంపీనే చెప్పారు. ఈ క్రాప్‌ నమోదులో 40% వివరాలు సంపూర్ణంగా లేవు. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న ప్రభుత్వం ఆ సొమ్మును ఆరు, ఏడు నెలలు గడిచినా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’’ అని ఆలపాటి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని