విద్యుత్‌ యూనిట్‌ గరిష్ఠ ధర రూ.12.. సాఫ్ట్‌వేర్‌ మార్పునకు సీఈఆర్‌సీ ఆదేశం

విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో డే ఎహెడ్‌ మార్కెట్‌ (డ్యామ్‌), రియల్‌టైమ్‌ మార్కెట్‌ (ఆర్‌టీఎం) ద్వారా కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.12కు మించకూడదని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ....

Published : 04 Apr 2022 09:41 IST

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో డే ఎహెడ్‌ మార్కెట్‌ (డ్యామ్‌), రియల్‌టైమ్‌ మార్కెట్‌ (ఆర్‌టీఎం) ద్వారా కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.12కు మించకూడదని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) ఆదేశించింది. దీనికి అనుగుణంగా విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లోని సాఫ్ట్‌వేర్‌ను రీడిజైన్‌ చేయాలని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు యూనిట్‌కు రూ.20గా ఉన్న గరిష్ఠ ధర తగ్గనుంది. డిస్కంల విద్యుత్‌ కొనుగోలు వ్యయం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా మధ్య అంతరం పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని