వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ భూమి

కాకినాడ జిల్లా కేంద్రంలో వైకాపా కార్యాలయానికి రెండెకరాల ప్రభుత్వ భూమిని బదలాయిస్తూ నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపింది. కాకినాడ అర్బన్‌ మండలంలోని రమణయ్యపేటలో ఆర్‌ఎస్‌ నంబరు 155/2-

Published : 27 May 2022 05:36 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా కేంద్రంలో వైకాపా కార్యాలయానికి రెండెకరాల ప్రభుత్వ భూమిని బదలాయిస్తూ నగరపాలక సంస్థ పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపింది. కాకినాడ అర్బన్‌ మండలంలోని రమణయ్యపేటలో ఆర్‌ఎస్‌ నంబరు 155/2-7బీలోని రెండు ఎకరాల భూమిని వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి స్థల బదలాయింపు చేయాలని కలెక్టర్‌ కోరగా, మేయర్‌ సుంకర శివప్రసన్న నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఆమోదించడానికి (ర్యాటిఫై చేయడానికి) మేయర్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ భూమిని ఎలా బదలాయిస్తారని ప్రశ్నిస్తూ... తెదేపా కార్పొరేటర్లు చర్చకు పట్టుపట్టారు. దీంతో తెదేపా, వైకాపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని