పామర్రు-చల్లపల్లి మార్గం.. ప్రాణాలతో చెలగాటం!

కృష్ణా జిల్లా పామర్రు నుంచి కూచిపూడి, మొవ్వ మీదుగా చల్లపల్లి వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిలో ప్రయాణించడం ఓ సాహసమే అని చెప్పాలి.

Published : 10 Jul 2023 03:04 IST

కృష్ణా జిల్లా పామర్రు నుంచి కూచిపూడి, మొవ్వ మీదుగా చల్లపల్లి వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిలో ప్రయాణించడం ఓ సాహసమే అని చెప్పాలి. మొత్తం 26 కిలోమీటర్లున్న ఈ రోడ్డు 21 కి.మీ. మేర ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ముఖ్యంగా పామర్రు మండలం నాగపట్నం నుంచి పెదపూడి, కూచిపూడి- మొవ్వ కోర్టు వరకు, కొడాలి వంతెన- చల్లపల్లి వరకు దారిలో గుంతలు తప్ప రోడ్డే కనిపించదు. వర్షం వస్తే గోతుల్లో నీరు నిండి లోతు తెలియక వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతోంది. ఉభయగోదావరి జిల్లాలకు కీలకమైన రహదారి ఇది. పాఠశాలల బస్సులు, ఆటోలు, చల్లపల్లి, అవనిగడ్డ మీదుగా ఒంగోలు జాతీయరహదారికి వెళ్లే భారీ వాహనాలూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. స్థానిక ప్రజలు రోడ్డు వేయాలని అడిగినప్పుడల్లా.. ‘నిధులు మంజూరయ్యాయి. టెండర్ల దశలో ఉన్నాయి’ అని అధికారులు ఏడాదిగా చెబుతూనే ఉన్నారు.

ఈనాడు, కృష్ణా; న్యూస్‌టుడే, కూచిపూడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని