Karumuri: రేషన్‌ మాఫియా ఇప్పుడే కాదు అప్పుడూ ఉంది: మంత్రి కారుమూరి

రేషన్‌ బియ్యం మాఫియా గతంలో లేనట్లు.. ఇప్పుడే ఉన్నట్లు ‘ఈనాడు’ పత్రికలో కథనాలు రాస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.

Updated : 29 Jul 2023 08:14 IST

తణుకు, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యం మాఫియా గతంలో లేనట్లు.. ఇప్పుడే ఉన్నట్లు ‘ఈనాడు’ పత్రికలో కథనాలు రాస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (Karumuri Venkata Nageswara Rao) అన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషన్‌ బియ్యం పంపిణీకి తెదేపా ఐదేళ్ల పాలనలో రూ.32,981 కోట్లు ఖర్చు పెడితే, వైకాపా నాలుగేళ్ల పాలనలోనే రూ.59,509 కోట్లు పారదర్శకంగా వెచ్చించినట్లు చెప్పుకొచ్చారు. శుక్రవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘వైకాపా వారి రేషన్‌ మాఫియా’ శీర్షికతో ప్రచురితమైన కథనం అవాస్తవమన్నారు. తెదేపా హయాంలో 2,137 విజిలెన్స్‌ తనిఖీలు చేయగా, ప్రస్తుతం వైకాపా పాలనలో 10,718 తనిఖీలు చేపట్టామన్నారు. తెదేపా పాలనలో రేషన్‌ మాఫియా జరగనట్టు ఇప్పుడే ఏదో కొత్తగా జరుగుతున్నట్లు రాయడం సరికాదన్నారు. చంద్రబాబు హయాంలో కందిపప్పు కిలోకు రూ.23 రాయితీ ఇవ్వగా, తాము రూ.49 రాయితీ ఇచ్చి ప్రజలందరికీ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా 67 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుండగా, మిగిలిన 80 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. అధికారులను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి అవాస్తవ కథనాలు రాస్తూ బురద చల్లుతున్నారని మంత్రి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని