నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

కరీంనగర్‌ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్‌ నాగరాజు సురేంద్ర(కలం పేరు ఎలనాగ)కు ‘గాలిబ్‌ నాటి కాలం’ అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం(2023) లభించింది.

Updated : 12 Mar 2024 06:40 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్‌ నాగరాజు సురేంద్ర(కలం పేరు ఎలనాగ)కు ‘గాలిబ్‌ నాటి కాలం’ అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం(2023) లభించింది. ఈ మేరకు సాహిత్య అకాడమీ సోమవారం ప్రకటించింది. 1953లో ఎలగందుల గ్రామంలో జన్మించిన ఈయన వృత్తిరీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. 1980 నుంచి 1986 వరకు నైజీరియాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తర్వాత 1989 నుంచి 2012 వరకు ఏపీ వైద్య విధాన పరిషత్‌లో పనిచేసి రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఎన్నో అనువాద రచనలు చేశారు. అందులో ఒకటైన ‘గాలిబ్‌ నాటి కాలం’ అనే  రచనను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచే ఆయన రచనలు ప్రారంభించారు. వివిధ ప్రక్రియల్లో, అనువాదంలో దాదాపు 38 నవలలు ప్రచురితమయ్యాయి. గతంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని