‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’

ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మండిపడ్డారు.

Updated : 29 Apr 2024 07:52 IST

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు సూర్యనారాయణ

కడప(అరవిందనగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మండిపడ్డారు. కడపలో ఆదివారం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. 11వ వేతన సవరణ, డీఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. 12వ వేతన సవరణ ఎప్పుడిస్తారో తెలియడం లేదు. కంటింజెంట్స్‌, కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల మందిని మాత్రమే క్రమబద్ధీకరించారు. మిగిలిన లక్ష మంది పరిస్థితి ఏంటి? ఆర్టీసీలో పనిచేస్తున్న వారు ఏ పింఛను పరిధిలోకి వస్తారో తెలియడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సర్వీసులపై నేటికీ స్పష్టత లేదు. ఆయా సమస్యలకు 30 ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ద్వారా పరిష్కారాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని