గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు

జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు.

Updated : 29 Apr 2024 06:24 IST

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్‌ చిత్రలేఖనం ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించి, 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు. ఏప్రిల్‌ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మానోత్సవం ఏర్పాటు చేసి... కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్‌ దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు, అధ్యాపకులు బి.ఆదినారాయణ, లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వేమనారాయణ, సంయుక్త కార్యదర్శి రాజారెడ్డి, సభ్యులు జేమ్స్‌ దంపతులను సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని