మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్‌!

పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది.

Published : 30 Apr 2024 07:25 IST

పులివెందులలో కూలిన వైఎస్సార్‌ విగ్రహం 

కడప, న్యూస్‌టుడే: పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. సోమవారం సీఎం జగన్‌ సొంత ఇలాకా వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని కదిరి రింగురోడ్డు కూడలిలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం కూలిపోయింది. జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రకు గుర్తుగా గతేడాది డిసెంబరు 24న ఈ విగ్రహంతో పాటు పక్కనే రైతుల విగ్రహాలనూ ఆవిష్కరించారు. వైఎస్‌ విగ్రహం ఉంచిన వేదిక పనులు నాసిరకంగా చేయడంతో అది కాస్త పగుళ్లిచ్చింది. దీంతో ఏకంగా ప్రతిమే ఒరిగిపోయింది. పురపాలక సంఘం ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి కూలిన విగ్రహాన్ని పరిశీలించి పట్టణంలోకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని