బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్‌ పంపిణీ

బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వెల్లడించారు.

Updated : 03 May 2024 08:08 IST

ఈనాడు, అమరావతి: బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వెల్లడించారు. 74,399 మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీరి జాబితాను శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 65.49 లక్షల మందికిగాను 63.31 లక్షల(96.67 శాతం) మంది పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని