రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు.

Published : 03 May 2024 05:21 IST

కర్నూలు జిల్లాలో అత్యధికం.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. దాంతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో నికరంగా 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. మూడు నెలల్లో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. తాజా లెక్కల ప్రకారం పురుషుల కంటే 7,18,764 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,71,473 మంది ఓటర్లున్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో భీమిలి, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో పెడన మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.

224 పోలింగ్‌ కేంద్రాలు పెరుగుదల

  • పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 46,165 నుంచి 46,389కు పెరిగింది.
  • 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లున్న పోలింగ్‌ కేంద్రాలను విభజించి కొత్తగా 224 కేంద్రాలు ఏర్పాటుచేశారు.
  • అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాల్లో కర్నూలు తర్వాత స్థానాల్లో అనంతపురం (20,20,243), విశాఖపట్నం (20,16,069), నెల్లూరు (19,44,874) జిల్లాలు వరుసగా ఉన్నాయి.
  • అతి తక్కువ ఓటర్లు కలిగిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా (7,71,478) మొదటి స్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా (7,85,675) రెండో స్థానంలో ఉన్నాయి.
  • ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.
  • అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 16,448 మంది, అతి తక్కువగా ఎన్టీఆర్‌ జిల్లాలో 392 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని