Phone pay: ఫోన్‌పే నుంచి 6 రుణ పథకాలు

ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్‌ మీద 6 విభాగాల్లో సెక్యూర్డ్‌ రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

Published : 31 May 2024 03:45 IST

దిల్లీ: ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్‌ మీద 6 విభాగాల్లో సెక్యూర్డ్‌ రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. మ్యూచువల్‌ ఫండ్, పసిడి, ద్విచక్రవాహనం, కారు, గృహ/ఆస్తి తనఖా, విద్యా విభాగాల్లో రుణాలు పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులతో పాటు టాటా కేపిటల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్‌ ఫిన్‌కార్ప్, డీఎంఐ హౌసింగ్‌ ఫైనాన్స్, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ లాంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 15 భాగస్వామ్య సంస్థలు ఉండగా.. వచ్చే త్రైమాసికం కల్లా ఈ సంఖ్యను 25కు పెంచుకోవాలని ఫోన్‌పే లక్ష్యంగా పెట్టుకుంది. ‘డిజిటల్‌ పద్ధతిలో సెక్యూర్డ్‌ రుణాల మంజూరుపై ఆర్థిక సంస్థలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. అందువల్ల ఈ సేవల ప్రారంభానికి ఇదే అత్యుత్తమ సమయం అని భావిస్తున్నామ’ని ఫోన్‌పే లెండింగ్‌ సీఈఓ హేమంత్‌ గలా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని