Redmi: మొబైల్‌ పేలి బాలిక మృతి.. స్పందించిన తయారీసంస్థ!

Redmi on mobile blast: మొబైల్‌ ఫోన్ వినియోగిస్తున్న సమయంలో అది పేలి పోవటంతో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. కేరళలో త్రిస్సూర్‌లో జరిగిన ఈ ఘటనపై రెడ్‌మీ తాజాగా స్పందించింది.

Published : 27 Apr 2023 20:24 IST

దిల్లీ: కేరళలో మొబైల్‌ ఫోన్‌ పేలి 8 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ స్పందించింది. రెడ్‌మీ కంపెనీకి చెందిన ఫోన్‌ పేలడంతో బాలిక మృతి చెందిందని వార్తలు రావడంతో దీన్ని ఆ సంస్థ ఖండించింది. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, ఫోన్‌ పేలడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు దర్యాప్తులో అధికారులకు సహకరిస్తామని పేర్కొంది.

‘కస్టమర్ల భద్రతే మాకు అన్నింటి కంటే ప్రధాన అంశం. ఇలాంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇలాంటి కష్టతరమైన సమయంలో బాలిక కుటుంబానికి అండగా ఉంటాం. రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే ఈ ఘటన జరిగిందని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. ఘటనకు అసలు కారణమేంటో కనుక్కునేందుకు దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాం’’ అని రెడ్‌మీ ఓ ప్రకటనలో తెలిపింది.

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక ఫోన్‌లో సినిమా చూస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్‌ బృందం కూడా రంగంలోకి దిగింది. రెడ్‌మీకి చెందిన ఫోన్‌ పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే, పోలీసులు నిర్ధారించలేదు. మరోవైపు మొబైల్‌ ఫోన్‌ వాడుతున్న సమయంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు కొత్తేం కాదు. కొన్ని రోజుల క్రితం ఉత్తర్‌ ప్రదేశ్‌లో స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా షాక్‌ కొట్టి ఓ బాలుడు మరణించాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని