Wind Energy: సుజ్లాన్‌ చేతికి 82 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్ట్

‘సుజ్లాన్‌ గ్రూప్‌’..ఆయిస్టర్‌ గ్రీన్‌ హైబ్రిడ్‌ వన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 82 మెగావాట్ల (MW) పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను పొందింది.

Updated : 31 May 2024 19:29 IST

దిల్లీ: ఆయిస్టర్‌ గ్రీన్‌ హైబ్రిడ్‌ వన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 82 మెగావాట్ల (MW) పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను పొందినట్లు సుజ్లాన్‌ గ్రూప్‌ శుక్రవారం తెలిపింది. సుజ్లాన్‌.. 26 విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను (WTGs) ఏర్పాటు చేయనుంది. ఇవి ఒకొక్కటి 3.15 MW రేట్‌ సామర్థ్యంతో మధ్యప్రదేశ్‌లోని అగర్‌ వద్ద ఆయిస్టర్‌ గ్రీన్‌ సైట్‌లో ఏర్పాటు చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందంలో భాగంగా సుజ్లాన్‌ విండ్‌ టర్బైన్స్‌ను సరఫరా చేస్తుంది. కంపెనీ సమగ్ర కార్యకలాపాలు, నిర్వహణ సేవలను కూడా చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాణిజ్య, పారిశ్రామిక (C&I) అవసరాలకు ఉపయోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని