Paytm: 85% పేటీఎం వాలెట్‌ యూజర్లకు ఇబ్బంది లేదు: శక్తికాంత దాస్‌

Paytm: రెగ్యులేటరీ చర్యల కారణంగా పేటీఎం వాలెట్‌ వినియోగదారుల్లో 80-85 శాతం మంది ఎటువంటి అంతరాయాన్ని ఎదుర్కోబోరని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

Published : 06 Mar 2024 22:09 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (Paytm payments bank) విధించిన ఆంక్షల గురించి ఆర్‌బీఐ (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి స్పందించారు. ఆంక్షల మూలంగా పేటీఎం వాలెట్‌ యూజర్లలో 80-85 శాతం మందికి ఎలాంటి ఇబ్బందీ తలెత్తబోదన్నారు. మిగిలిన 15 శాతం మంది మాత్రం తమ వాలెట్లను నిర్దేశిత గడువులోగా ఇతర బ్యాంకులతో అనుసంధానించుకోవాలని సూచించారు.

పేటీఎం ఎఫెక్ట్‌.. గూగుల్‌ పే, ఫోన్‌పే వైపు యూజర్ల చూపు

పేటీఎం వాలెట్‌ను ఇతర బ్యాంకులతో అనుసంధానించేందుకు మార్చి 15 వరకు గడువు ఉంది. ఇప్పటివరకు తమ వాలెట్లను ఇతర బ్యాంకులతో అనుసంధానం చేయనివారు గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ నిర్దేశించిన గడువు సరిపోతుందని, పొడిగించాల్సిన అవసరం లేదని దాస్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే 80-85 శాతం మంది వాలెట్‌ యూజర్లు ఇతర బ్యాంకులకు లింక్‌ చేసుకున్నారని, మిగిలినవారూ వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఫిన్‌టెక్‌ సంస్థల అభివృద్ధికి ఆర్‌బీఐ పూర్తి మద్దతునిస్తుందని దాస్‌ పేర్కొన్నారు. తమ చర్య కేవలం పేటీఎం పేమెంట్‌ బ్యాంకుపై మాత్రమేనని తెలిపారు. పేటీఎం యాప్‌ అంశం ఎన్‌పీసీఐ చూసుకుంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని