Aditya Birla: సరికొత్త D2C యాప్‌ను ప్రారంభించిన ఆదిత్య బిర్లా

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం వచ్చే మూడేళ్లలో 3 కోట్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 16 Apr 2024 18:35 IST

దిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఓమ్ని ఛానెల్‌ D2C ప్లాట్‌ఫాం ‘ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌ డిజిటల్‌’ (ABCD) యాప్ ప్రారంభించింది. దీన్ని లాంచ్ చేసిన సందర్భంగా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా మాట్లాడుతూ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సేవలను అందించడమే ఈ ప్లాట్‌ఫాం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా వచ్చే మూడేళ్లలో 3 కోట్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కోన్నారు. ఈ యాప్‌ తయారీ కోసం ఆదిత్య బిర్లా రూ.100 కోట్లు వెచ్చించారని సీఈఓ విశాఖ మూలే తెలిపారు. ప్రస్తుతం, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తన వ్యాపారాలకు సంబంధించి.. రుణాలు, బీమా, ఆస్తుల నిర్వహణతో సహా 3.5 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తుండగా.. టెలికాం, ఫ్యాషన్‌, రిటైల్‌ వంటి ఉత్పత్తులు, సేవలు ద్వారా 25 కోట్ల మంది వినియోగదారులకు సేవలను అందిస్తోంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు సంబంధించిన బీమా, క్రెడిట్‌, పెట్టుబడి వ్యాపారాలు రాబోయే 3-5 సంవత్సరాల్లో 19-21 శాతం వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందొచ్చని బిర్లా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని