Air India Express: ఫస్ట్‌ టైమ్‌ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఆఫర్‌

Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అదేంటో చూద్దాం..

Updated : 18 Apr 2024 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) తన వంతుగా ఓ ముందడుగేసింది. తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ, ఇంటర్నేషనల్‌ సర్వీసుల టికెట్‌ ధరలపై వారికి 19 శాతం రాయితీ ప్రకటించింది.

ఈ ఆఫర్‌ పొందాలనుకునేవారు 18 నుంచి 22 ఏళ్ల వయసువారై ఉండాలి. మొబైల్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 1 మధ్య ప్రయాణించాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు గమ్యస్థానమై ఉండాలి. ఆఫర్‌ పొందడం కోసం ఐడీ సహా సంబంధిత పత్రాలు చూపించాలి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని (Air India Express) ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌.. ఇలా నాలుగు కేటగిరీలకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని