Amararaja Energys: అమరరాజా ఎనర్జీ లాభం రూ.230 కోట్లు

అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి  రూ.230 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.

Published : 29 May 2024 03:27 IST

తుది డివిడెండ్‌ రూ.5.10

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి  రూ.230 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.142 కోట్లతో పోలిస్తే, ఇది 62% అధికం. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.2433 కోట్ల నుంచి రూ.2908 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.934 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23లో ఈ మొత్తం రూ.731 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం రూ.10,392 కోట్ల నుంచి రూ.11,708 కోట్లకు పెరిగింది. ప్రతి షేరుపై రూ.5.10 తుది డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. 

గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదు చేసినట్లు అమరరాజా సీఎండీ జయదేవ్‌ గల్లా వివరించారు. ఆటోమోటివ్‌ ఆఫ్టర్‌ మార్కెట్, డేటా సెంటర్‌ విభాగాల్లో కొత్త ఉత్పత్తులు విడుదల చేసినట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన గౌరినేని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన గిగా కారిడార్‌ ప్రాజెక్టు చురుకుగా ముందుకు సాగుతున్నట్లు మరొక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేని వెల్లడించారు. ప్యాక్‌ ఫెసిలిటీ నుంచి వాణిజ్య ఉత్పత్తి త్వరలో ప్రారంభం అవుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని