Ambuja Cement: అంబుజా చేతికి ‘మై హోమ్‌’ గ్రైండింగ్‌ యూనిట్‌

అదానీకి సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్‌ తమిళనాడులోని మై హోం గ్రూప్‌కు సంబంధించిన సిమెంట్ గ్రైండింగ్‌ యూనిట్‌ను కొనుగోలు చేయనుంది.

Updated : 15 Apr 2024 17:24 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్‌ తమిళనాడులోని తూత్తుకుడిలో మై హోం గ్రూప్‌కు చెందిన 1.50 MTPA సిమెంట్‌ గ్రైండిండ్‌ యూనిట్‌ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు అంబుజా సిమెంట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్‌ పోర్ట్‌ సమీపంలో 61 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఒప్పందంతో దక్షిణాది మార్కెట్లలో అంబుజా సిమెంట్స్‌ తన ఉనికిని మరింత మెరుగుపర్చుకోనుంది. భారతదేశంలోని ప్రముఖ సిమెంట్‌ కంపెనీల్లో ఒకటైన అంబుజా..దాని అనుబంధ సంస్థలైన ఏసీసీ లిమిటెడ్‌, సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌తో కలిపి దేశవ్యాప్తంగా 18 ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 19 సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు కలిగి ఉంది. దీంతో అదానీ గ్రూప్‌ సిమెంట్‌ సామర్థ్యం 78.90 MTPAకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని