Amul Milk: అమూల్‌ పాల ధరల పెంపు.. లీటర్‌పై ఎంతంటే..

Amul Milk:  పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని అమూల్‌ తెలిపింది. పెంపు దేశవ్యాప్తంగా ఉంటుందని వెల్లడించింది.

Updated : 03 Jun 2024 12:06 IST

దిల్లీ: అమూల్‌ పాల ధరలు (Amul milk price) పెరిగాయి. అన్ని రకాలపై పెంపు వర్తించనున్నట్లు ‘అమూల్‌’ బ్రాండ్‌తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF)’ ఆదివారం రాత్రి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒక్కో లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. చివరిసారి అమూల్‌ 2023 ఫిబ్రవరిలో ధరలను సవరించింది.

పెరిగిన ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని GCMMF తెలిపింది. తమ అనుబంధ పాల సంఘాలు రైతులకిచ్చే పరిహారాన్ని గత ఏడాది వ్యవధిలో 6-8 శాతం పెంచినట్లు పేర్కొంది. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది. తద్వారా అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడింది.

సమగ్ర అవగాహన ఉంటేనే ఎఫ్‌అండ్‌ఓలో ట్రేడ్‌ చేయాలి

తాజా పెంపుతో లీటర్‌ పాల ధరలు ఇలా..

  • అమూల్‌ తాజా- రూ.56
  • అమూల్‌ గోల్డ్‌- రూ.68
  • అమూల్‌ ఆవు పాలు- రూ.57
  • అమూల్‌ ఏ2 గేదె పాలు- రూ.73

మదర్‌ డెయిరీ సైతం..

మదర్‌ డెయిరీ సైతం దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచింది. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని